వందనమే యేసునకు వరుసుగుణోదారునకు సౌందర్య ప్రభువునకు సర్వేశ్వర
నీకు ||వందనమే||
1. యెహోవా తనయునకు ఇమ్మానుయేలునకు బహు కరుణాభరణునకుఁ
ప్రభువుల ప్రభువునకు||వందనమే||
2. ఆశ్రిత జనపాలునకు నకలుష వర దేహునకు ఇశ్రాయేల్ రాజునకు
యెహోవా నీకు||వందనమే||
3. మరియాతనూజునకు మహిమ గంభీరునకుఁ పరిశుద్ధాచరణునకుఁ
బరమేశ్వర నీకు||వందనమే||
4. రాజులపై రాజునకు రవికోటి తేజునకుఁ పూజార్హపదాబ్జునకు
భువనావన నీకు||వందనమే||
5. ప్రేమ దయా సింధునకు క్షేమామృత పూర్ణునకు ఆమే నని సాష్టాంగము
లర్పింతుము నీకు||వందనమే||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
వందనమే యేసునకు వరుసుగుణోదారునకు సౌందర్య ప్రభువునకు Lyrics
Your favourites
- No Favourites found!
