Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
వర్షింపనీ వర్షింపనీ నీ ప్రేమ జల్లులు Telugu Christian Song Lyrics

వర్షింపనీ వర్షింపనీ నీ ప్రేమ జల్లులు Lyrics


వర్షింపనీ వర్షింపనీ
నీ ప్రేమ జల్లులు మాపై వర్షింపనీ (2)
నీ వాక్యపు చినుకుతో జీవింపనీ
యేసయ్యా.. నీ ఆత్మ వర్షంతో ఫలియింపనీ (2)       ||వర్షింపనీ||

ఎడారి బ్రతుకులో నీ వాక్య చినుకు కురిపించి
సజీవ ధారలతో ప్రతి కఠిన గుండెను తాకి (2)
ఆశతో ఉన్నవారికి నీ వాక్కుతో ప్రాణం పోయనీ (2)        ||వర్షింపనీ||

ఎండిన జీవంపై నీ ఆత్మ వర్షం కుమ్మరించి
సజీవ జలములపై పొంగి ప్రతి చోటకు సాగి (2)
దాహం గొన్న వారికి నీ ఆత్మలో సకలం పొందనీ (2)       ||వర్షింపనీ||

Your favourites

  • No Favourites found!