వారు భాగ్యవంతు లౌదురు భూ లోకమందు వారు భాగ్యవంతులౌదురు
చారు శుభవార్తా రవంబు గోరి యాకర్ణించి భక్తి మీరఁ దెలిసికొనిన
యట్టి ధీరు లెవ్వ రెవ్వరో ||వారు||
1. వారు నడుచు మార్గమందున సుక్షేమ రాజి వారి ననుసరించు నెందును
తేరి చూడ రాని దే దీప్యమాన దివ్యసత్య భూరి తేజ మాజనములఁ
బొలుపు మీరఁ జుట్టుకొనును ||వారు||
2. విమోచకుని నామమందున దజ్జనంబుల విశ్రుతానందంబు ప్రాణముల
అమందముగ హెచ్చరించు నతని నీతి రీతిఁ దజ్జ నముల కోర్కె వృద్ధి
బొం దంగఁ జేయు సంతతంబు ||వారు||
3. నరులపై బిశాచమును నిందా స్థాప నంబు జేయంగలేదు పరగు
ప్రకాశమును బ్రాపు నైన సర్వే శ్వరుఁడు బలము రక్షయు న వారితముగ
మనకు నిచ్చు ||వారు||
4. వరగుణ ప్రశస్తులారా క్రైస్తవులారా వన్నె మీర మీ రాజు
సురుచిరముగ శాశ్వతముగఁ పరిపాలించు మీ దేవుఁడు నిరతముగను
జీవించు నీతి భరిత చిత్తుఁడగుచు ||వారు||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
వారు భాగ్యవంతు లౌదురు భూ లోకమందు Lyrics
Your favourites
- No Favourites found!
