Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
వారు ధన్యు లైన పిల్లలు భూలోకమందు Telugu Christian Song Lyrics

వారు ధన్యు లైన పిల్లలు భూలోకమందు Lyrics

వారు ధన్యు లైన పిల్లలు భూలోకమందు వారు ధన్యులైన పిల్లలు
కోరి విచారమును ప్రభుని సార వాక్య మెదను బెట్టి వారి వారి కితరులైన
వారికిని విధేయులైన ||వారు||

1. అన్నదములందు నెటులను తనతోడ నాడు చున్న యితరులందు
నటులను భిన్న మెంచ కొక్కరీతిఁ దన్నుఁబోలె ప్రియ మొనర్చి తిన్నని
బడియందు నేర్చు చున్నవార లెవ్వరో ||వారు||

2. ఒక్కఁడె తండ్రి యతఁడు దేవుఁడు మన కందరకును సకల సుఖములిచ్చు
నెప్పుడు అకట మన మిఁకను జగడము లాడఁదగదు ప్రభుని రీతి
నొకని నొకఁడు ప్రియము చేసి యుండుద మని తలఁచుచుండు ||వారు||

3. మంచి మేలు లనుభవింపఁగఁ గరుణించి దేవుఁ డెంచి మనల నిచటఁ
గూర్చెఁగ వంచనలఁ ద్యజించి కనిక రించి యొకనినొకఁడు మది స
హించి మంచి క్రియలతో వ ర్తింప నిశ్చయింతు రెవరో ||వారు||

4. ఆకసమున నున్న దేవుఁడు మన మనసు రాక పోక లన్ని చూచు
నెప్పుడు ఏకముగా హృదయములు వి వేకమున వెలుంగఁ జేసి
ప్రాకాటముగఁ బ్రభుని యాజ్ఞ గైకొనియెడి వార లెవరో ||వారు||

Your favourites

  • No Favourites found!