Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
వేచియుంటిని నీ తట్టు యేసువమేము వేచి Telugu Christian Song Lyrics

వేచియుంటిని నీ తట్టు యేసువమేము వేచి Lyrics

వేచియుంటిని నీ తట్టు యేసువమేము వేచి యుంటిమి నీ తట్టు
భాసురఁబుగ మహిమన్ భాసిల్లురాకకై నాశతో కరములు చాచుచు
నీవైపు ||వేచి||

1. కూడుచుంటిమి యిచ్చట వేడుకగల కూటంబులలొ కూర్మితో
గోడులేనిపరమ కూటంబులలో భక్త కోటులతో గూడి పాడుచునిన్
స్తుతియింప ||వేచి||

2. నమ్మియుంటిమి నీ యొక్క నమ్మకమైన నెయ్యంపు వాగ్దానములన్
ఇమ్ముగ దివికేగి నెమ్మి నెలవులు గట్టి మమ్ముట దోడ్కొని పోవన్
నమ్మబల్కిన మీకై ||వేచి||

3. వెఱచుచుంటిమి యిచ్చట తరుచుగగల్గె కరుకైన స్థితిగతులలోన్
కరువువేదన భీతి మరణ దుఃఖములేని పరమపురమున జేరి మురియు
టెప్పుడొ యంచు ||వేచి||

4. నిత్యంబు విలసిల్లెడి నిశ్చలమైన శృంగార స్వర్గంబున ముత్యాల
ద్వారమున నిశ్చింతపోవుచు బంగారువీధుల సంచరించుట యెపుడో
||వేచి||

5. రంగుగు క్షయధనముల సంగడిజేరి భంగంబు పడుచుంటిమి
దొంగలుదోయని చిమ్మటకొట్టని తుప్పయిన పట్టని యక్షయ ధనమునకై
||వేచి||

Your favourites

  • No Favourites found!