Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
వెదకుడి వెదకుడి యెహోవాను వెదకుడి సమయముండగనే Telugu Christian Song Lyrics

వెదకుడి వెదకుడి యెహోవాను వెదకుడి సమయముండగనే Lyrics

వెదకుడి వెదకుడి - యెహోవాను వెదకుడి
సమయముండగనే – ఆయనను వెదకుడి
కృపకాలముననే ఆయనను వెదకుడి (2) "వెదకు"
1. ఆయన మీకు - దొరుకు కాలమున
నీ పూర్ణ హృదయముతో - ఆయనను వెదకినా
నీపై జాలితో - నిన్ను క్షమియించును -2
తరుణము పోయినా- మరల రాదు -2 "వెదకు"
2. తెల్లవారు జామున - నీ కంఠ స్వరముతో
ఉపవాసముతో - కన్నీటి ప్రార్థనతో
యెహోవాను వెదకిన - మోక్షము దొరుకును -2
తరుణము పోయినా - మరల రాదు -2 "వెదకు"
3. బాలుడైన యేసుని - జ్ఞానులు వెదికిరి
మగ్ధలేని మరియ - యేసుని వెదికెను
కన్నీటితో హన్నా - దేవుని వెదికెను -2
తరుణము పోయినా - మరల రాదు -2 "వెదకు"
4. హిజ్కియ వెదకి - ఆయుస్సు సంపాదించే
ఎస్తేరు వెదకి - తన వారిన్‌ రక్షించే
దేవునిని నమ్మినవారే – ఆయనను స్తుతియింతురు -2
తరుణము పోయినా - మరల రాదు "వెదకు"

Your favourites

  • No Favourites found!