Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను Telugu Christian Song Lyrics

వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను Lyrics

వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను
తన కనికరము కృపలను పొంద తానె సహాయకుడు
1. మన ప్రార్థన ప్రభువాలకించి - అత్యధికముగా మనకిచ్చును
మేల్కొని మనము ప్రార్థించిన - ఆశీర్వదించునుగా
2. ఆత్మలనెల్ల ప్రభు రక్షించి - తన మందిరమునకు తెచ్చి
తన ఆలయములో మేలుపొంద - వేడెదము మనము
3. అందరికి రక్షణ కలుగ - రాజులకు అధికారులలో
సర్వలోకుల ఉజ్జీవముకై - వేడెదము ప్రభునే
4. వాక్యము వర్ధిల్లి వ్యాపింపను - శత్రుని రాజ్యము కూలునట్లు
సేవకులాత్మతో నింపబడ - వేడెదము మనము
5. ఆత్మతో ప్రభుయింటిని కట్టి - దాని యందు ప్రభు మహిమనిండి
తన ఘనత వర్ధిల్లునట్లు - వేడెదమాయనను
6. సజీవ రాళ్ళతో యిల్లుకట్టి - నీ అధికారము నిలుచునట్లు
దేవా నీ హృదయానుసారులను - లేపమని వేడెదం


Your favourites

  • No Favourites found!