వెలుగును రక్షణ కర్తయునగునా బలమగు దేవుని స్తోత్రింతును వెరువను
నేనిక నెవ్వరికిన్ వెలుగైన యేసే నా దుర్గము
1. అగాధ చీకటి జలముల నుండి అఖండమైన వెలుగు సృజించిన
యుగయుగంబుల నేలెడి ప్రభువు యఘముల బాపి నను వెలిగించును ||వెలు||
2. నా దీపమును వెలిగించు ప్రభువే నా దరి చీకటిన్ వెలుగుగ మార్చును
నా దోషము లెల్లను దన కాంతిలో నాదరముగ కడిగి రక్షించును ||వెలు||
3. పలువిధ శోధనల్ నను జుట్టినను విలువగు సంపద లంతరించినను
వెలుగుదూత నాపై యురులొడ్డిన నలయక నిత్యము నడచెద వెల్గులో ||వెలు||
4. తల్లిదండ్రులు విడచినగాని యుల్లము భీతిని భయమందినను ఎల్ల
ప్రజలు నను ద్వేషించినను ఎడబాయడునా ప్రియుడగు యేసు ||వెలు||
5. క్రీస్తు యేసుడే లోకపు వెలుగని వాస్తముగ గనుడి ప్రియులార
శాశ్వతంబగు రాజ్యము చేర సత్వరమాయన వెలుగును బొందరె ||వెలు||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
వెలుగును రక్షణ కర్తయునగునా బలమగు దేవుని Lyrics
Your favourites
- No Favourites found!
