Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
వేఁడెద నాదగు వినతిని గైకొనవే జగదీశ Telugu Christian Song Lyrics

వేఁడెద నాదగు వినతిని గైకొనవే జగదీశ Lyrics

వేఁడెద నాదగు వినతిని గైకొనవే జగదీశ ప్రభో
నేఁడు ప్రతిక్షణ మెడబాయక నా తోడ నుండవె ప్రభో ||వేఁడెద||

1.
ప్రాతస్తవము భవత్సన్నిధి సర్వంబున నగు నాదౌ
చేతస్సున ధర్మాత్మను సంస్థితిజేయవె సత్కృపను ||వేఁడెద||

2.
నేఁ బాతకి నజ్ఞానుఁడఁ ప్రభువా నీవు కరుణజేయు
పాపాచరణము నందున జిత్తము బాపుము నాకెపుడు ||వేఁడెద||

3.
పాపముఁ గని భీతుఁడనై శంకా పరత సతము నుండన్
నా పైనుంచుము నీదగు సత్కరుణా దృష్టిని బ్రేమన్ ||వేఁడెద||

4.
నాదగు పాప భరం బంతయు నీ మీఁదనె యిడుచుందున్
నీదు మహాకృప నుండి యొసంగుము నిర్మల గతి నాకున్ ||వేఁడెద||

5.
అవిరత మతి నిటు లతులిత గతి నీ స్తుతి నుతు లొనరింతున్
భవదంఘ్రలపై నాదగు భక్తిని బ్రబలింపవే యేసు ||వేఁడెద||

Your favourites

  • No Favourites found!