వెరువనేల మనసా క్రీస్తుని వేఁడవే నా మనసా యిరుకునఁ బడి
యెడు వేళలోఁ క్రీస్తుని చరణము చేరువ జేరిన సుఖ మది ||వెరువ||
1. శోధన కాలమునఁ క్రీస్తుని బోధకు చెవి నిమ్మా సాధించెడు సా
తానుని వల మరి ఛేదించెడు నిఁకఁ బెదరకు ||వెరువ||
2. పాపపు స్త్రీ వచ్చి పరిమళ తైలము తాఁ దెచ్చి పాప మెడలు నని
తనలో ననుకొని యేపున క్రీస్తుని నెలమి భుజించెను ||వెరువ||
3. గ్రుడ్డివాడు నిలిచి మార్గము బడ్డ యేసుని బిలచి చెడ్డవాడనని
చేయివిడువకు మన దొడ్డ క్రీస్తు కందోయి నొసంగెను ||వెరువ||
4. గాసి బడుచు రోగి యగు చెలి యాశచేత వచ్చి వాసిగ యేసుని
వస్త్రమంటి సుఖ వాసి యయ్యె ప్రభు యేసుని కృపచే ||వెరువ||
5. లాజరుండు మృతుడై పడువే ళ సమాధికి వచ్చి లాజరా యని
బల్కరుణను బిలువఁగ రాజిల బ్రతికెను బ్రాణాన్వితుఁడై ||వెరువ||
6. పరిసయ్యునిలోని భావము ప్రభు తాఁ గనుఁగొనుచుఁ తిరిగి పొమ్ము
నీ దురితము వెడలెను వెరువకు మని యాదరముగ బలికెను ||వెరువ||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
వెరువనేల మనసా క్రీస్తుని వేఁడవే నా Lyrics
Your favourites
- No Favourites found!
