వేసారిన మనసే ఊగెనే
చేజారిన స్ధితికి చేరెనే
యే గాయమైన మానదే
నాకున్న బలము చాలదే (2)
వినిపించు యేసు నీ స్వరం
నడిపించు నీతో అనుక్షణం ||వేసారిన||
కోరినాను శ్రేయమైన నీ ప్రేమనే
తాళలేను లేసమైన నీ కోపమే
భారము మోపకే లోపమూ చూడకే
ఎన్నడు నీ కృప దూరము చేయకే ||వేసారిన||
వాడిపోదు శ్రేష్టమైన ఈ బంధమే
వీడిపోదు ఆదరించే నీ స్నేహమే
తోడుగా ఉండునే – త్రోవను చూపునే
చేకటి కమ్మినా క్షేమము పంపునే ||వేసారిన||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
వేసారిన మనసే ఊగెనేచేజారిన స్ధితికి చేరెనేయే Lyrics
Your favourites
- No Favourites found!
