Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
విధేయతకే అర్ధము చెప్పిన వినయ మనస్కుడా Telugu Christian Song Lyrics

విధేయతకే అర్ధము చెప్పిన వినయ మనస్కుడా Lyrics

విధేయతకే అర్ధము చెప్పిన వినయ మనస్కుడా
విధేయులుగా ఉండ మాదిరి చూపిన మనుజ కొమరుడా
అవిధేయత తొలగించుమయ్యా
నీ దీన మనస్సు కలిగించుమయ్యా (2) ||విధేయతకే||
పరిచర్య చేయుటకే ధరణికి వచ్చిన త్యాగమూర్తివి
ప్రతి చర్య జరిగించక పగవారిని క్షమియించిన ప్రేమ దీప్తివి (2)
సిలువ మరణము పొందునంతగా నీవే తగ్గించుకొంటివి (2)
అధికముగా హెచ్చింపబడితివి (2) ||అవిధేయత||
పరిపూర్ణమైన భయ భక్తులతో తండ్రికి లోబడితివి
ప్రతి విషయములో పంపిన వాని చిత్తము నెరవేర్చితివి (2)
శ్రమలు పొంది యాజకుడని దేవునిచే పిలువబడితివి (2)
రక్షణకు కారకుడవైతివి (2) ||అవిధేయత||

Your favourites

  • No Favourites found!