Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
విడిపిస్తాడు నా యేసుడు మరణపు లోయైనా Telugu Christian Song Lyrics

విడిపిస్తాడు నా యేసుడు మరణపు లోయైనా Lyrics


విడిపిస్తాడు నా యేసుడు
మరణపు లోయైనా నను విడువడూ (2)
మనసు ఓడిపోయిననూ
మనువు వాడిపోయిననూ (2)
నను ఎత్తుకొనీ…
నను ఎత్తుకొనీ కాలికి ధూలైన తగలక      ||విడిపిస్తాడు||

ఆశలన్నీ క్షణికములో ఆవిరియై పోయినా
కంటిమీద కునుకేమో కన్నీళ్ళై పారినా (2)
తన కౌగిటిలో…
తన కౌగిటిలో హత్తుకొనీ నన్నాదరించి      ||విడిపిస్తాడు||

ఎండమావులే స్నేహితులై ఓదర్పే కరువైనా
బండరాల్లే భాగ్యములై బ్రతుకు భారమైననూ (2)
తన కౌగిటిలో…
తన కౌగిటిలో హత్తుకొనీ నన్నాదరించి      ||విడిపిస్తాడు||

కలలు అన్ని కల్లలై కలతలతో నిండిననూ
గాలి మేడలే ఆస్తులై శూన్యములే మిగిలిననూ (2)
తన కౌగిటిలో…
తన కౌగిటిలో హత్తుకొనీ నన్నాదరించి      ||విడిపిస్తాడూ||

Your favourites

  • No Favourites found!