Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
విడువను నిను ఎడబాయనని నా కభయ Telugu Christian Song Lyrics

విడువను నిను ఎడబాయనని నా కభయ Lyrics


విడువను నిను ఎడబాయనని నా
కభయ మొసంగిన దేవా
నా కభయ మొసంగిన దేవా

నేరములెన్నో చేసి చేసి – దారి తప్పి తిరిగితినయ్యా (2)
నేరము బాపుము దేవా – నీ దారిని నడుపుము దేవా         ||విడువను||

పందులు మేపుచు ఆకలి బాధలో – పొట్టును కోరిన నీచుడనయ్యా (2)
నీ దరి చేరితినయ్యా నా తండ్రివి నీవెగదయ్యా          ||విడువను||

మహిమ వస్త్రము సమాధానపు జోడును నాకు తొడిగితివయ్యా (2)
గొప్పగు విందులో చేర్చి నీ కొమరునిగా చేసితివి        ||విడువను||

సుందరమైన విందులలో పరిశుద్దులతో కలిపితివయ్యా (2)
నిండుగా నా హృదయముతో దేవ వందనమర్పించెదను         ||విడువను||

Your favourites

  • No Favourites found!