విజయగీతముల్ పాడరే క్రీస్తునకు జయ విజయగీతముల్ పాడరే
వృజిన మంతటి మీఁద విజయ మిచ్చెడు దేవ నిజకుమారుని నామమున్
హృదయములతో భజన జేయుచు నిత్యమున్ ||విజయ||
1. మంగళముగ యేసుఁడే మనకు అక్షణ శృంగమై మరి నిల్చెను
నింగిన్ విడిచి వచ్చెను శత్రుని యుద్ధ రంగమందున గెల్చెను రంగు
మీరఁగఁదన రక్తబలము వలనఁ పొంగు నణఁగఁజేసెను సాతానుని
బల్ క్రుంగ నలిపి చీల్చెను||విజయ||
2. పాపముల్ దొలఁగింపను మనలను దన స్వ రూపంబునకు మార్పను
శాపం బంతయు నోర్చెను దేవుని న్యాయ కోపమున్ భరియించెను
పాప మెరుఁగని యేసు పాపమై మనకొరకు పాపయాగము దీర్చెను
దేవుని నీతిన్ ధీరుఁడై నెరవేర్చెను||విజయ||
3. సిలువ మరణము నొందియు మనలను దనకై గెలువన్ లేచిన వానికి
చెలువుగన్ విమలాత్ముని ప్రేమను మనలో నిలువన్ జేసిన వానికిఁ
కొలువుఁజేతుమెగాని ఇలను మరువక వాని సిలువ మోయుచు నీ కృపా
రక్షణ చాల విలువ గలదని చాటుచు||విజయ||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
విజయగీతముల్ పాడరే క్రీస్తునకు జయ విజయగీతముల్ Lyrics
Your favourites
- No Favourites found!
