Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘనవిజయుండాయెను సాతానుని Telugu Christian Song Lyrics

విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘనవిజయుండాయెను సాతానుని Lyrics

విజయుండు క్రీస్తు ప్రభావముతో
ఘనవిజయుండాయెను
సాతానుని తలను చితుక ద్రొక్కెను
సదా రాజ్యమేలును
1. ఓ మరణమా నీ ముల్లు యెక్కడ?
ఓ సమాధి నీ విజయమెక్కడ?
సిలువ శక్తితో విరుగగొట్టెను
విజయుండు సర్వంబులో
2. యూదా గోత్రంపు సింహమాయనే
గ్రంథమును విప్ప యోగ్యుండు తానే
ఏడు ముద్రలను విప్పెడివాడు
యోగ్యుండు సర్వమందు
3. ఆయనే శిరస్సు తన సంఘమునకు
మృతులలో నుండి ప్రథముడై లేచె
మన ప్రభుయేసే మరణమును గెల్చె
సర్వములో ప్రధానుడై
4. సింహాసనమందు వున్న మన ప్రభువే
పద్మరాగముల మరకతముల బోలి
సూర్యకాంతివలె ప్రకాశించెను
జయమని పాడెదము
5. ఆయన యెదుట సాగిలపడి
నాలుగు జీవులు పెద్దలందరును
సర్వసృష్టికి దేవుండవని
ఆరాధించి మ్రొక్కిరి
6. క్రీస్తు యేసు ద్వారా దేవునికే స్తుతులు
విజయమునిచ్చె తన ద్వారా మనకు
అధిక విజయము మనకిచ్చు ప్రభువే
అందరిలో అతిశ్రేష్టుండు


Your favourites

  • No Favourites found!