Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
విలువైనది ఈ జీవితం అన్ని వేళల Telugu Christian Song Lyrics

విలువైనది ఈ జీవితం అన్ని వేళల Lyrics


విలువైనది ఈ జీవితం
అన్ని వేళల ఆనందించెదం
సంపూర్ణ సంతోషమిచ్చువాడు
సకల సమృద్ధుడేసు బహు సంపన్నుడు
మనలను పిలచే వారసులుగా
నాట్యముతోను సంగీత సబ్దములతో
పండుగ చేద్దాం రండీ నేడు

యేసు ఒక్కడే మనకు మాదిరి
మన జీవిత సారధి
లేరు లోకంలో యేసుకు సాటి
ఆయనే మన ఊపిరి
మదిలోని ఆశలు యెరిగిన దేవుడు
అడుగక ముందుగ బదులిచ్చుచుండగా
మనకేమి లేమి లేదు

యేసు మరువడు మనలనెన్నడు
గమ్యము వరకు చేర్చును
కనిన కలలన్ని నెరవేర్చునాయనే
మనకింకేమి కలవరము
నిన్న ఇకరాదు రేపటి దిగులొద్దు
ఈనాడే మనకున్న అనుకూల సమయము
జీవితాన్ని ఒక వేడుక చేద్దాం

Your favourites

  • No Favourites found!