Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
విలువైనది నీ ఆయుష్కాలం తిరిగిరానిది దేవుడు Telugu Christian Song Lyrics

విలువైనది నీ ఆయుష్కాలం తిరిగిరానిది దేవుడు Lyrics


విలువైనది నీ ఆయుష్కాలం
తిరిగిరానిది దేవుడు నీకిచ్చిన కాలం (2)
దేవునితో ఉండుటకు బహు దీర్ఘ కాలం
దేవునికై అర్పించవా ఈ స్వల్ప కాలం (2)            ||విలువైనది||

బంగారు సంపదలను దొంగలెత్తుకెళ్లినా
దొరుకునేమో ఒకనాడు నిరీక్షణతో వెదకినా
నీ కడుపున పుట్టిన కుమారుడు తప్పిపోయిన
నీ కొరకు వస్తాడేమో వెదకుచు ఒక రోజున
పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము (2)
క్షణమైనా వచ్చుఁనా పోయిన నీ కాలము (2)            ||విలువైనది||

మనిషి సగటు జీవితం డెబ్బది సంవత్సరములు
అధిక బలము ఉన్న యెడల ఎనుబది సంవత్సరములు
ఆయాసము దుఃఖమే నీ కడవరి కాలము
ఆదరించువారు లేని కన్నీటి క్షణములు
దేవునికి క్రీస్తులా అర్పిస్తే ఈ కాలము (2)
దేవునితో క్రీస్తు వలె ఉండెదవు కలకాలము (2)            ||విలువైనది||

Your favourites

  • No Favourites found!