Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
విలువైనది సమయము ఓ నేస్తమాఘనమైనది జీవితం Telugu Christian Song Lyrics

విలువైనది సమయము ఓ నేస్తమాఘనమైనది జీవితం Lyrics

విలువైనది సమయము ఓ నేస్తమా
ఘనమైనది జీవితం ఓ ప్రియతమా (2)
సమయము పోనివ్వక సద్భక్తితో
సంపూర్ణతకై సాగెదము (2) ||విలువైనది||
క్రీస్తుతో మనము లెపబడిన వారమై
పైనున్నవాటినే వెదకిన యెడల (2)
గొర్రెపిల్లతొ కలిసి
సీయోను శిఖరముపై నిలిచెదము (2) ||విలువైనది||
శోధన మనము సహించిన వారమై
క్రీస్తుతొ మనము శ్రమించిన యెడల (2)
సర్వాధికారియైన
ప్రభువుతో కలిసి ఏలెదము (2) ||విలువైనది||
క్రీస్తుతో మనము సింహాసనముపై
పాలించుటకై జయమొందుటకు (2)
సమర్పణ కలిగి
పరిశుద్దతలో నిలిచెదము (2) ||విలువైనది||

Your favourites

  • No Favourites found!