Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
విమల హృదయ మిమ్ము విదితంబు నినుఁ Telugu Christian Song Lyrics

విమల హృదయ మిమ్ము విదితంబు నినుఁ Lyrics

విమల హృదయ మిమ్ము విదితంబు నినుఁ గొల్వ యేసునాధా నీదు
విమల రక్తము చేత విశదమౌ యెద నిమ్ము విశ్వనాధా ||విమల||

1. అణఁకువ క్షమశాంత మధికముగ నాకిమ్ము ఆత్మనాధా నీకుఁ
బ్రణుతమౌ నా యెద ప్రభునిపీఠము జేయు మాత్మనాధా ||విమల||

2. నీ చిత్తమే యంచు నీ పాదములఁ బట్టి నిల్చియుందు నిండు
నికరమౌ ప్రకటమౌ సుకరహృదయ మిమ్ము మేసునాధా ||విమల||

3. భయభక్తు లలరెడు భావంబు నా కిమ్ము జీవనాధా నన్ను లయ
జీవములయందు జయశాలినిగఁ జేయు మేసునాధా ||విమల||

4. పరిశుద్ధ హృదయంబు పరమేశ నా కిమ్ము ధరణిమీఁద నన్ని
తరుణములను నాకా దరణ మీవే యంచుఁ దలఁప నాధా ||విమల||

5. నీ రూపము నిమ్ము నినుఁ బోలి నేనుండ నిత్యనాధా నీదు
సారూప్య మెదమీద సంపూర్తిగా వ్రాయు సత్యనాధా ||విమల||

6. ప్రేమపూరిత హృదయ మేమరక నా కిమ్ము ప్రేమనాధా యెంతో
ప్రేమమౌ సుమమౌ నేమమౌ బ్రతుకిమ్ము క్షేమనాధా ||విమల||

Your favourites

  • No Favourites found!