వినరే నరులారా మనముల వేడుకలను మీర మన, రక్షకుఁడగు
మరియా తనయుని మహిమలు చెవులార ||వినరే||
1. తన కన్నను ముందు యోహా నను నతఁ డింపొందు ఘనతర
మగును ప్రవచనముఁబ ల్కెను భూజను లందు ||వినరే||
2. అతఁడు యోర్దాను నదిలో ఖ్యాతిగ ననుదినమున్ పాతకులకు
బా ప్తిస్మ మిచ్చు నెడం ప్రభు వచ్చటి కరిగెన్ ||వినరే||
3. న్యాయము నిలుపుటకై ప్రభుని వి ధేయతఁ గనుపఱచి శ్రేయ పతి
బొం దెను యోహానుని చేత బాప్తిస్మంబు ||వినరే||
4. పరమండల మపుడు తెరవం బడి పావురము గతిన్ పరిశుద్ధాత్మ శు
భప్రభ లీనుచుఁ ప్రభువు మీఁద వ్రాలెన్ ||వినరే||
5. ఆకాశమునుండి కలిగెను ప్రాకటమగు రవము నా కితఁడు ప్రియం
బౌ కుమారుఁడా నంద మొంది రనుచు ||వినరే||
6. అంతట మన కర్త పరిశుద్ధాత్మ బలము కలిమిన్ సంతసమున మో
క్ష కుశలవార్తను జాటంగను దొడఁగెన్ ||వినరే||
7. ఆ నిత్య సువార్త మన మెద లో నిడి నమ్మినచో నానందమయం
బమృత మేసు ద యా నిధి మన కొసంగున్ ||వినరే||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
వినరే నరులారా మనముల వేడుకలను మీర Lyrics
Your favourites
- No Favourites found!
