Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
వినరే యపోస్తలుల కార్యముల్ క్రైస్తవు లను Telugu Christian Song Lyrics

వినరే యపోస్తలుల కార్యముల్ క్రైస్తవు లను Lyrics

వినరే యపోస్తలుల కార్యముల్ క్రైస్తవు లను వారి కవి యెంతో ధైర్యముల్
మనసు లొక్కటిఁ జేసి కొని యట్లు ప్రార్థింప ఘన ముగ విమలాత్మ
చనుదెంచె వారిపై ||వినరే||

1. పరమండలమునుండి వచ్చెను పెద్ద కరువలివలె శబ్ద మిచ్చెను తిర
ముగ వార లం దరుఁ గూడి యున్న మం దిర మెల్ల నిండె బం ధురమై
తన్నాదము ||వినరే||

2. అనలార్చులను దీప్తి మించుచు బీఁట లగు జిహ్వల్వలె గనుపించుచు
ఘనముగ నొక్కొక్క జనునిపై నవి నిల్వఁ గను బరిశుద్ధాత్మచే తను
నింపఁబడి రంత ||వినరే||

3. వారన్య భాషలతోడను నాత్మ ప్రేరణమును జేయు జాడను ధారా
ళముగ భాషాం తరము లాడిరి విన్న వారి కబ్బురమై వి చారము ల్బొడమంగ
||వినరే||

4. ముందట వారిటుల గుంపుగ మోద మందుచు దేవునిఁ గొల్చి తా
మందరు చూడఁగ వింత వింత పనుల నందందు జేసిరి దేవుని
దయచేత ||వినరే||

5. మనము నా రీతిగ గుంపుగాఁ గూడి మన దేవుఁ గొల్వఁగ భూమిలో
మనుజుల కాశ్చర్య మగు కార్యములఁ జేయ నొనగూడు మనసు
కా నందమును గల్గు ||వినరే||

Your favourites

  • No Favourites found!