Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
వినరే యో నరులారా వీనుల కింపు Telugu Christian Song Lyrics

వినరే యో నరులారా వీనుల కింపు Lyrics

వినరే యో నరులారా వీనుల కింపు మీర మనల అక్షింప క్రీస్తు
మనుజావతారుఁ డయ్యొ వినరే అనుదినమును దే వుని తనయుని పద
వనజంబులు మన మున నిడికొనుచును ||వినరే||

1. నరరూపుఁ బూని ఘోర నరకుల రారమ్మని దురితముఁ బాపు దొడ్డ
దొరయో మరియా వరపుత్రుఁడు కర మరు దగు క ల్వరి గిరి దరి కరి
గి రయంబున ప్రభు కరుణను గనరే ||వినరే||

2. ఆనందమైన మోక్ష మందరి కియ్య దీక్ష బూని తనమేని సిలువ
మ్రాను నణఁచి మృతిఁ బొందెను దీన దయా పరుఁ డైన మహాత్ముఁడు
జానుగ యాగము సలిపిన తెరంగిది ||వినరే||

3. పొందుఁగోరిన వారి విందా పరమోపకారి యెంద రెందరిఁ బరమా
నందపద మొందఁగఁ జేసెను అందమునన్ దన బొంది సురక్తము
జిందెను భక్తుల డెందము గుందఁగ ||వినరే||

4. ఇల మాయావాదుల మాని యితఁడే సద్గురు డని తలపోసి చూచి
మతి ని శ్చల భక్తిని గొలిచిన వారికి నిల జనులకు గలు ములనలరెడు
ధని కుల కందని సుఖ ములు మరి యొసఁగును ||వినరే||

5. దురితము లణఁప వచ్చి మరణమై తిరిగి లేచి నిరత మోక్షానంద
సుం దర మందిరమున కరుదుగఁ జనె బిరబిర మన మం దర మా
కరుణా శరనిధి చరణ మె శరణని పోదము ||వినరే||

Your favourites

  • No Favourites found!