Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
వినవా మనవి యేసయ్యా ప్రభువా శరణం Telugu Christian Song Lyrics

వినవా మనవి యేసయ్యా ప్రభువా శరణం Lyrics


వినవా మనవి యేసయ్యా
ప్రభువా శరణం నీవయ్యా
మలినము నా గతం – పగిలెను జీవితం
చేసుకో నీ వశం          ||వినవా||

లోక స్నేహమే కోరి దూరమైతిని
వీడిపోయి నీ దారి ఓడిపోతిని
విరిగిన మనసుతో నిన్ను చేరాను
చితికిన బ్రతుకులో బాగు కోరాను
నన్ను స్వీకరించి నీతో ఉండనీ యేసయ్యా
నా తండ్రి నీవేనయ్యా       ||వినవా||

ఆశ ఏది కానరాక బేలనైతిని
బాధలింక పడలేక సోలిపోతిని
అలసిన కనులతో నిన్ను చూసాను
చెదరిన కలలతో కృంగిపోయాను
నన్ను సేదదీర్చి సంతోషించని యేసయ్యా
నా దైవము నీవయ్యా        ||వినవా||

Your favourites

  • No Favourites found!