Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
వినవే నా వినతి నివేదన దయ Telugu Christian Song Lyrics

వినవే నా వినతి నివేదన దయ Lyrics

వినవే నా వినతి నివేదన దయ వెలయఁగ నో ప్రభువా నిను శర
ణొందితి ననుఁ గుశలంబున నునుపవె యో ప్రభువా ||వినవే||

1.
నిర్మల గతి సంధ్యా కాలంబున నీ స్తవమగు ప్రభువా ధర్మదీప్తి నా
కొసఁగి చేయు దీప్తవంతునిగ నన్ను ||వినవే||

2.
నీ మహదాశ్రయ మొసఁగి దుర్గతిని నేఁబడకుండఁగను నా మది
తన్వాది సమస్తముతో ననుఁ గావవె ప్రభువా ||వినవే||

3.
ఎన్ని దినంబులు జగతి నున్న నీ కన్న వేరే గలవా పన్నుగ మది
నీ పద సంగతమై యున్నది రేవగలు ||వినవే||

4.
పాప కరుండను నే సుకృతా పాది కర్మ మెఱుఁగ నీ పాద సరోజము
నా కొసఁగుము నాపై నీ కృపఁ జెలఁగ ||వినవే||

5.
నీ కొరకై నా మనము దృఢంబౌఁ గాక యేసు ప్రభువా నాకుఁ
బిశాచముచే భ్రమ జన్మము గాకుండఁగ నేలు ||వినవే||

Your favourites

  • No Favourites found!