Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
వినరయ్య నరులారా విశ్వాసమున క్రీస్తు విమల Telugu Christian Song Lyrics

వినరయ్య నరులారా విశ్వాసమున క్రీస్తు విమల Lyrics

వినరయ్య నరులారా విశ్వాసమున క్రీస్తు విమల బోధ పాప మనుజుల
కెల్ల పా వన జీవనము సేయు వసుధ మీఁద ||వినరయ్య||

1. పాపాత్ములను పశ్చా త్తాపము పడుఁడంచు బ్రభువు దెల్పెన్ దన
దాపు గోరినవారిఁ గాపాడుటకుఁ దానే దక్షుడయ్యెన్ ||వినరయ్య||

2. భారాక్రాంతులైన పాపులఁ దనుఁ జేరఁ బ్రభువు పిల్చెన్ శ్రమలు
దూరంబుఁ జేసిత ద్దురితముల్ బాపి సం తోష మియ్యన్ ||వినరయ్య||

3. అనుమానింపక నెవ్వ రైన వచ్చినఁ ద్రోయ ననుచుఁ బల్కెన్ పెక్కు
మనుజుల కొఱకు జీ వన మియ్యనే వచ్చి తనుచుఁ దెల్పెన్ ||వినరయ్య||

4. మనసారదేవునిన్ మానక ప్రేమింపు మనుచునేర్పెన్ ఇంకఁ దన
పోల్కె నొరులకు దాను బ్రేమింపగ దనర దెల్పెన్ ||వినరయ్య||

5. తన శిష్యులకు నైక్య మును బ్రేమించుట కాజ్ఞ లొనర నిచ్చె నెంతో
ఘన సత్ప్రభువు కాళ్లు గడిగి భక్తులచోట వినతుఁ డయ్యెన్
||వినరయ్య||

Your favourites

  • No Favourites found!