Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
విందు పరమందుఁబెండ్లి విందు పరమందుఁ బొందు Telugu Christian Song Lyrics

విందు పరమందుఁబెండ్లి విందు పరమందుఁ బొందు Lyrics

విందు పరమందుఁబెండ్లి విందు పరమందుఁ బొందు జనుల డెందములా
నందము నొందు ||విందు||

1. సత్య సంధుఁ డైన యేసు సామికి సభకు నిత్య ప్రధానము యెహోవా
నిర్ణయించెను రండు ||విందు||

2. నీతి కనికరములతోడ నినుఁ బ్రధానము ప్రీతిగా నొనరించితినని పిలచె
సత్యము రండు ||విందు||

3. ఎన్నఁడు విడనాఁడను నే నెంత మాత్రము నిన్నెడఁబాయ నను మాట
నిజము దత్తము రండు ||విందు||

4. పరమ నగరు ద్వారములు తెరువఁబడినవి గురుతరమణి తోరణమును
గూర్పఁబడినవి రండు ||విందు||

5. నిత్యజీవ పదార్ధములు నిండి యున్నవి సత్యమచట మనము చేర
సర్వము మనవి రండు ||విందు||

6. దూత లంత యేసు ప్రభుని బ్రీతిఁ జేయను నూతన సంగీతములను
జేతురు వినను రండు ||విందు||

Your favourites

  • No Favourites found!