వినుడి సోదరులారా - నా యేసు ప్రభు - యిల కేతెంచెన్
1. ఇలకేతెంచెన్ - ముక్తిని దెచ్చెన్
పాపుల విడిపించెన్ - విడిపించ నేసు యిలకేతెంచెన్
2. స్వర్గీయ తండ్రికి - ఏక కుమారుడు
మనుష్య పుత్రుండాయెన్ - పుత్రుండుగా యిలకేతెంచెన్
3. గ్రుడ్డికి కన్నులు - మూగకి మాటలు
చెవిటికి చెవుల నిచ్చెన్ - యిచ్చుటకేసు యిలకేతెంచెన్
4. కుష్టు రోగుల - శుద్ధులజేసెను
చచ్చినవారిని లేపెన్ - లేపుటకేసు యిలకేతెంచెన్
5. పాపములో నీవు - పడియుండగా
పవిత్ర ప్రేమను జూపెన్ - జూపించనేసు యిలకేతెంచెన్
6. పాపిల కొరకై - సిలువను మోసెన్
రక్తము చిందించెన్ - చిందించ నేసు యిలకేతెంచెన్
7. యేసు నామమున - విశ్వాసముంచుము
నిశ్చయముగ రక్షించున్ - రక్షించనేసు యిలకేతెంచెన్
8. మహిమ ఘనత - మాయేసు ప్రభునకే
మమ్ముల తండ్రితో జేర్చెన్ - జేర్చుటకేసు యిలకేతెంచెన్
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
వినుడి సోదరులారా నా యేసు ప్రభు Lyrics
Your favourites
- No Favourites found!
