Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
విశ్వాకాశము లాదులనుసృష్టించిన విభుఁ డగు పరమఈశుఁడు Telugu Christian Song Lyrics

విశ్వాకాశము లాదులనుసృష్టించిన విభుఁ డగు పరమఈశుఁడు Lyrics


1. విశ్వాకాశము లాదులను
సృష్టించిన విభుఁ డగు పరమ
ఈశుఁడు సర్వశక్తుఁ డగు ||
భాసుర తండ్రిన నమ్ముదును ||
నమ్ముదును నే నమ్ముదును ||

2. పరిశుద్ధాత్ముని మూలమున
మరియ కన్యకా గర్భమున
ధరియింప బడి పుట్టిన శ్రీ
గురు ప్రభుయేసును నమ్ముదును
నమ్ముదును నే నమ్ముదును ||

3. పొంతి పిలాతుని కాలమున
నెంతో శ్రమపడి సిల్వఁబడి
వింతగ యధోతుల మందెనని ||
నమ్ముదును నే నమ్ముదును ||

4. మూఁడవనాఁడు మృతి నుండి
వడిగాఁ బునరుత్థానుండై
చూడఁగ బరమున కేతెంచె
నాధుని కుడియెఁడ గూర్చుండెన్ ||
నమ్ముదును నే నమ్ముదును ||

5. అక్కడ నుండి యిహమునకుఁ
గ్రక్కున వచ్చి సజీవులకు
నిక్కము న్యాయముమృతులకును
జక్కగఁ దీర్చెడు నని మదిని ||
నమ్ముదును నే నమ్ముదును ||
నమ్ముదును నే నమ్ముదును ||

6. పరిశుద్ధాత్ముని నమ్ముదును
నమ్ముదును నే నమ్ముదును
పరిశుద్ధాత్ముని నమ్ముదును
నమ్ముదును నే నమ్ముదును ||

7. పరిశుద్ధ పరచంబడిన
సర్వసాధారణ సంఘం
పరిశుద్ధుల యన్యోన్య మగు
పరిశుద్ధ స్నేహము కల వంచు ||
నమ్ముదును నే నమ్ముదును ||

8. మహికర్మ పరిహారమును
దేహ పునరుత్థానము
బహుళము నిత్య జీవమును
మహిమ యనంతమై వెలయు నని ||
నమ్ముదును నే నమ్ముదును
ఆమేన్||

Your favourites

  • No Favourites found!