Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని నిత్యజీవము Telugu Christian Song Lyrics

విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని నిత్యజీవము Lyrics

విశ్వాస సహితముగను - ప్రకటించుడి యేసుని
1. నిత్యజీవము చేపట్టి - సత్యవేదము చేబూని (2)
పవిత్ర హృదయములతో - పోరాడుడి విజయముతో (2)
2. నీతిని భక్తిని గోరి - నిజమైన విశ్వాసులుగా
ఓర్పును ప్రేమనుగల్గి - పోరాడుడి విజయముతో
3. ఆకాశమున నుండి - కలిగిన దర్శనమునకు
అవిధేయత చూపకను - పోరాడుడి విజయముతో
4. క్రీస్తేసు మనసు కలిగి - సత్క్రియలను జరిగించి
యోధులుగా నిలుచుండి - పోరాడుడి విజయముతో
5. దీన మనసు కలిగి - ప్రియులారా లోబడియు
మహిమ కిరీటముకై - పోరాడుడి విజయముతో
6. ఆత్మల రక్షణకొరకై - అర్పించుడి జీవితము
అంతమువరకు నిలిచి - పోరాడుడి విజయముతో
7. యేసుని జీవము కలిగి - ఇలలో శ్రమనోర్చుచు
విజయోత్సాహముతోడ - హల్లెలూయ పాడెదము


Your favourites

  • No Favourites found!