Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
విశ్వాసమే విజయము విను ప్రియుఁడా య Telugu Christian Song Lyrics

విశ్వాసమే విజయము విను ప్రియుఁడా య Lyrics

విశ్వాసమే విజయము విను ప్రియుఁడా య విశ్వాస మపజయము
విశ్వాసాయుతమైన విసుకని సుకార్యములే విశ్వాసవంతునికి విజయ
మొసంగును నిజము ||విశ్వాసమే||

1. భక్తుఁ డందు వలననే బ్రతుకును మరియు శక్తినొంది నిల్చును
యుక్తముగ వర్తించి యుర్విని జయించి ముక్తినొందున టంచు రక్తిగాఁ
బాడుదును ||విశ్వాసమే||

2. మంచి పేరు నొందును సాతాను నెది రించి విజయ మొందును
మించిన బాధ ల్స హించి జయించును నంచిత మరణము నానంద
ముగఁగాంచు ||విశ్వాసమే||

3. ప్రవిమల మొందెదము పాపమునుండి పరిహరింపఁబడుదుము
అవి రతమును మనము నాశ్చర్యముగ ఘనము భువియందున్ దివియందున్
బుధులతో నొందుదుము ||విశ్వాసమే||

4. నీతిమంతుల మౌదుము నిశ్చయము ప్ర ఖ్యాతి బోధను నేర్తుము ఆ
తండ్రి దత్తముల నన్ని యార్జించుచు యాతని సుభద్రములో ననయ
ముందుము నిజము ||విశ్వాసమే||

5. పరిపూర్ణ విశ్వాసమే క్రియలతో నున్న మరి మంచి విశ్వాసమే
ధరయందున్ బరమందున్ ధన్యాత్మునిగఁ జేయున్ సరగు నద్దానినే
సంపాదించుము ప్రియుఁడా ||విశ్వాసమే||

Your favourites

  • No Favourites found!