విశ్వాసముతో వేఁడెడి వారికి విశ్వ మంతయును వీల్పడును
శాశ్వత రాజ్య థీశ్వరుఁ డాఢ్యుఁడు శాశ్వత మగు నీ శాసన మె చ్చెను
||విశ్వా||
1. బిడ్డలు తండ్రుల వేడఁగ నన్నము బెడ్డ లిచ్చు వె ఱ్ఱులు గలరే దొడ్డ
తండ్రి నిలఁ దోడ్పా టడిగిన నడ్డులేక విమ లాత్మ నొసంగును ||విశ్వా||
2. నమ్మకమునఁ జెడు నరులను గానము నమ్మక చెడుదురు నరులయ్యో
ఇమ్మహి సకల శు భమ్ములు గలుగును సమ్మతి వెతకఁగ శాశ్వత రాజ్యము
||విశ్వా||
3. వెతకెడు వారికి వెసఁ గృపఁ జూపును గతిఁ గని వేడం గాఁ దెర
చున్ సతతము యేసుని చక్కని పేరట హిత మతి వేఁడగ నెంత యు
మేలగు ||విశ్వా||
4. బల మేమియుఁ గనఁ బడ దాహ నే సలిపెడు భక్తిని సతి మను చు
నలయకు నేలను నావగింజ మరి నిలిపినఁ జెట్టయి నింగికి నెదుగదె ||విశ్వా||
5. అవిశ్వాసమున నతి భీతులచే నవిసి క్రుంగ నగు నే మనసా
భువిఁ బాపాత్ములఁ బ్రోచెడు ప్రభు కృపఁ జవిఁ జూడుము నుతి
సల్పుచు వేగమే ||విశ్వా||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
విశ్వాసముతో వేఁడెడి వారికి విశ్వ మంతయును Lyrics
Your favourites
- No Favourites found!
