వివాహమన్నది పవిత్రమైనది
ఘనుడైన దేవుడు ఏర్పరచినది (2)
1. ఎముకలలో ఒక ఎముకగా
దేహములో సగ భాగముగా (2)
నారిగా సహకారిగా-
స్త్రీని నిర్మించినాడు దేవుడు (2) //వివాహ//
2. ఒంటరిగా ఉండరాదని
జంటగా ఉండ మేలని (2)
శిరస్సుగా నిలవాలని
పురుషుని నియమించినాడు దేవుడు (2) //వివాహ//
3. దేవునికి అతిప్రియులుగా
ఫలములతో వృద్ధి పొందగా (2)
వేరుగా నున్న వారిని
ఒకటిగ ఇల చేసినాడు దేవుడు (2) //వివాహ//
