వివాహమన్నది ఘనమైనది
ధరలోన దేవుడు స్తిరపరచినది (2)
సాటిరాదు ఎ బంధము ఈ జగతిలో ఎదకు (2)
ఏ జన్మలో ఈ బంధము నిలిచే కడవరకు (2)
1. తన పోలికలో పురుషుని చేసి
తనదైన ఊపిరితో జీవము పోసి (2)
సిరసుగా సారథిగా –
సమస్త్ముపై నిలిపినాడు దేవుడు (2)
ఇదే ఆ దేవుని శాసనము (2) || వివాహమన్నది ||
2. నరుడు ఒంటరిగా ఉండుట చూసి
సాటిఎయిన సహకారిని యోచన చేసి (2)
ప్రేమతో భాహుమానముగా –
స్త్రీని నిర్మించాడు దేవుడు (2)
ఇదే ఆ దేవుని శాసనము.. (2) || వివాహమన్నది ||
