Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
వ్యసనపడకుము నీవు చెడ్డవారలను జూచినయపుడు మత్సరపడకుము Telugu Christian Song Lyrics

వ్యసనపడకుము నీవు చెడ్డవారలను జూచినయపుడు మత్సరపడకుము Lyrics

వ్యసనపడకుము నీవు - చెడ్డవారలను జూచినయపుడు
మత్సరపడకుము నీవు - దుష్కార్యములు చేయువారిని జూచి
1. వారు గడ్డివలె త్వరగా - ఎండిపోదురు
పచ్చని కూరవలె వారు - వాడిపోవుదురు - ఆ ... నీవు
2. యెహోవా యందు నమ్మికయుంచి - మేలు చేయుము
దేశమందు నివసించి సత్యము - ననుసరించుము - ఆ ... నీవు
3. నీదు మార్గము యెహోవాకు అప్పగింపుము
ఆయనను నమ్ముకొనుము నీదు - కార్యము నెరవేర్చును ... నీవు
4. కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము
వ్యసనపడకుము నీ కది - కీడు కే కారణము ... నీవు
5. ఒకని నడత యెహోవాయే - స్థిరము చేయును
ఆయన వాని ప్రవర్తనను జూచి - ఆనందించును - ఆ ... నీవు
6. యెహోవా అతని చేతిని - పట్టి యుండెను
అతడు నేలను పడినను లేవ - లేక యుండడు - ఆ ... నీవు
7. నీతిమంతులు విడువబడుటగాని - వారి సంతానము
భిక్షమెత్తుటగాని - నేను చూచి యుండలేదు - ఆ ... నీవు


Your favourites

  • No Favourites found!