Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
వ్యోమ సింహాసనస్థుఁడ యుర్వి పాదపీఠస్థుఁడ మామకీన Telugu Christian Song Lyrics

వ్యోమ సింహాసనస్థుఁడ యుర్వి పాదపీఠస్థుఁడ మామకీన Lyrics

వ్యోమ సింహాసనస్థుఁడ యుర్వి పాదపీఠస్థుఁడ మామకీన దయా
మయుఁడ మమ్ముఁగావుమో దేవుఁడ ||వ్యోమ||

1.
అంతరిక్ష లోకదీప యద్భుతాదృశ్య స్వరూపా యింత నీ మహిమనోప
నెంతది నా నాల్క చూప ||వ్యోమ||

2.
గాలి ఱెక్కల పైనెక్కి గాఢాంధకారమునందు నేలికవై సంచరించు
నట్టి నిన్ను మ్రొక్కుచుందు ||వ్యోమ||

3.
నీతి న్యాయ దీర్ఘశాంతా నిర్మల దయా నితాంతా
ప్రీతినుంచవే శ్రీమంతా పెద్దఁగా నా కాలమంతా ||వ్యోమ||

4.
సర్వ భూలోక పూజితా సత్య సద్గుణ రాజితా గర్వ దుస్స్వభా
వాహితా కావునాన్ని నాట పితా ||వ్యోమ||

5.
నమ్మిన యీనన్నఁ తూల నాడవు దీనాత్మపాలా
క్రమ్మి నీ ప్రేమతోఁ జాల బ్రోతువు దయాలా వాలా ||వ్యోమ||

Your favourites

  • No Favourites found!