Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యాకోబు దేవుడాపద కాలంబుల యందు నిన్నుద్ధరించి Telugu Christian Song Lyrics

యాకోబు దేవుడాపద కాలంబుల యందు నిన్నుద్ధరించి Lyrics

యాకోబు దేవుడాపద కాలంబుల యందు
నిన్నుద్ధరించి నీ కుత్తరము నిచ్చును గాక!
1. పరిశుద్ధ స్థలమునుండి నీకు సాయమిచ్చును
సీయోనులోనుండి యెహోవా నిన్నాదరించును
2. నీ నైవేద్యములన్ని జ్ఞప్తి నుంచుకొనుచు
నీ దహన బలులను అంగీకరించును గాక
3. నీ కోరిక సిద్ధింపజేసి నీ యాలోచన
యంతటిని సఫలము చేసి నిన్ను గాచును
4. నీ రక్షణను బట్టి మేము యుత్సహింతుము
మా దేవుని నామమున ధ్యజము నెత్తెదము
5. నీ ప్రార్థనలన్ని యెహోవా సఫలపరచును
యెహోవా తన అబిషిక్తుని రక్షించును గాక
6. రక్షించి దక్షిణ హస్తబలమును చూపును
యుత్తరమిచ్చును పరిశుద్ధ స్థలము నుండి
7. అతిశయ పడుదురు రథ గుఱ్ఱములతో
యెహోవా నామములో మనము అతిశయింతుము
8. వారు కృంగి నేలమీదపడి లేవకున్నారు
మనము లేచి చక్కగా నిలుచుచున్నాము


Your favourites

  • No Favourites found!