Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
భయము లేదు దిగులే లేదు నా Telugu Christian Song Lyrics

భయము లేదు దిగులే లేదు నా Lyrics

భయము లేదు దిగులే లేదు
నా జీవితమంతా ప్రభు చేతిలో
నిరాశ నన్నెన్నడు ముట్టలేదు
నిరీక్షణతో అనుదినం సాగెదను (2)

యావే నీవే నా దైవం – తరతరముల వరకు
యావే నీవే నా ఆశ్రయం – తరతరముల వరకు
నీవు కునుకవు నీవు నిదురపోవు
ఇశ్రాయేలున్ కాపాడువాడ(వు) (2)

మరణ భయం అంతా పోయెను
శత్రు భీతి అంతా తొలగించెను (2)
మరణమును ఓడించి
శత్రువును జయించిన
సర్వాధికారివి నా దేవా (2)      ||యావే||

ఓటమిని అంతా తీసివేసి
రోగాన్ని అంతా మాన్పివేసి (2)
జయశీలుడవు
పరమ వైద్యుడవు
సర్వశక్తుడవు నా రక్షకా (2)      ||యావే||

Your favourites

  • No Favourites found!