Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ Telugu Christian Song Lyrics

ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ Lyrics

పల్లవి :ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ ||2||
           యేసయ్యా నీ ప్రేమానురాగం నను కాయును అను క్షణం ||2|| ||ఎడ||

చరణం :శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో
               కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో   ||2||
              అర్ధమే కానీ ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా ||2||
              కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి  ||2||  ||ఎడ||

చరణం :విశ్వాస పోరాటములో ఎదురాయె శోధనలు
              లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో ||2||
              దుష్టుల క్షేమము నే చూసి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా  ||2||
              దీర్ఘ శాంతము గలదేవా
               నా చేయి విడువక నడిపించితివి  ||2||  ||ఎడ||

చరణం :నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో
               నా బలమును చుసుకొని నిరాశ చెందితిని  ||2||
               భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా  ||2||
               ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి ||2|| ||ఎడ||

Your favourites

  • No Favourites found!