Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యెడతెగక ప్రార్థించుము మెలకువతో కొనసాగుము క్రీస్తుని Telugu Christian Song Lyrics

యెడతెగక ప్రార్థించుము మెలకువతో కొనసాగుము క్రీస్తుని Lyrics

యెడతెగక ప్రార్థించుము - మెలకువతో కొనసాగుము
1. క్రీస్తుని ఉపదేశమును పొంది - ఆయన మాదిరి మదియందుంచి
ప్రార్థించుము - కౄతజ్ఞతతో - ఆనంద గీతము పాడుచును
2. ఆయన రాకడ సమీపము - అర్థరాత్రో కూడి కూయునపుడో
గమనిక లేనివానివలె నుండిన - యజమానుని శిక్షకు గురి యగుదువు
3. ఉగ్రత నుండి తప్పించు యేసు - ప్రత్యక్షమౌను పరమందుండి
ఉపద్రవమందు పొందిన రక్షణ కాపాడుకొనన్ నీ ఆత్మయందు
4. మీరేగదా మాదు నిరీక్షణ - ఆనందమును అతిశయమని
ప్రేమతో ప్రయాస మొందునట్టి - దైవజనుల పోలి నడువంగను
5. విశ్వాసమందున్న లోపములను - సరిదిద్దుటకు కృపను పొంద
ప్రార్థించు సేవకుల ప్రేమను చూచి - వేదనతో వేడు శక్తిని పొంద
6. ప్రధానదూత శబ్దమును - దేవుని బూర ద్వనిని వినగా
క్రీస్తునందుండి మృతులైనవారు - లేతురు మొదట మనకన్న ముందు
7. నిద్రపోక భద్రముగా నుండ - భారముతో వేడుము ప్రభు శక్తిని
ఎత్తబడరు మత్తులైనవారు - మెలకువతో వేడు ఉజ్జీవాత్మకై
8. మీ ఆత్మజీవమును రాకడయందు - నిందారహిత సంపూర్ణతతో
సమాధాన కర్తన్ ప్రార్థించుము - కాపాడబడను పరిశుద్ధతలో


Your favourites

  • No Favourites found!