Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యెహోవా భజన చేయండి పాప నరులారా Telugu Christian Song Lyrics

యెహోవా భజన చేయండి పాప నరులారా Lyrics

యెహోవా భజన చేయండి పాప నరులారా యీ రీతి మరచి
పోకండి ||యెహోవా||

1.
యేసు పేరిట ప్రార్ధనంబు మన దోసములను బోగొట్టను వెరవు
భాసుర పరలోక సుఖము కోటి బాధలు మనకున్న సంతోషకరము ||యెహోవా||

2.
యేసు క్రీస్తును గొలువండి యేసు దాసులతో వాదము లాడకండి
మోసపు దారి విడువండి దోష రాసుల నుర్విలోఁ జేసికొనకండి ||యెహోవా||

3.
జీవ రక్షకుని నమ్మండి నిత్య సేవలో మెలఁగక చెడిపోకండి
భావించి యాత్మన్ వేఁడండి దేవ దేవుని నెడఁబాసి తెరవు విడకండి ||యెహోవా||

4.
మాయ లోకపు భ్రాంతుల్విడిచి మనుష్యాయువు భువిలోన
జెల్లుటఁ దలఁచి మాయ మార్గము లెల్ల మరచి మోక్ష మార్గము మన
మున మరవక తలఁచి ||యెహోవా||

5.
కాయము నొసఁగిన ప్రభుని యయిదు గాయంబు లాత్మలోఁ
గానంగ రాదా ఆయు వస్థిర మని తెలిసి మీరు కాయ మాత్మయు
నిపుడు కర్తకు నిచ్చి ||యెహోవా||

Your favourites

  • No Favourites found!