Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని Telugu Christian Song Lyrics

యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని Lyrics

యెహోవా ఇల్లు కట్టించని యెడల
దాని కట్టువారి ప్రయాసమును వ్యర్థమే
యెహోవా పట్టణమును కాపాడనియెడల
దాని కాయువారు మేల్కొనినను వ్యర్థమే
1. మీరు వేకువనే లేచి రాత్రియైన
తర్వాత పండు కొనుచు మీరు - తర్వాత
ఆర్జితమైన ఆహారమును
మీరు తినుచుండుట వ్యర్థమే - మీరు
2. తన ప్రియులు నిద్రించుచుండగా
తానే యిచ్చు చున్నాడు వారికి - తానే
తనయులు దేవుడిచ్చు స్వాస్థ్యము
కనెడి గర్భఫలము బహుమానమే - కనెడి
3. యౌవన కాలమున పుట్టిన కుమారులు
బలవంతుని చేతిలోని బాణములు - బలవంతుని
తన అంబుల పొదిని నింపుకొనువాడు
ధన్యుడు అట్టివాడు బహుగా ధన్యుడు
4. యెహోవా యందు భయభక్తులు కలిగి
నడచు వారందరు ధన్యులు - నడచు
మహా మేలు నీకు కలుగును
నిశ్చయముగా నీవు ధన్యుడవు
5. నీవు ధన్యుడవు లోగిట నీ భార్య
ఫలించు ద్రాక్షావల్లి వలె నుండు - ఫలించు
భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు
ఒలీవ మొక్కల వలె నుందురు
6. యెహోవా యందు భయభక్తి గలవాడు
ఆశీర్వదింపబడును నిజముగా - ఆశీర్వ
యెహోవా నిన్ను సీయోను నుండి
ఆశీర్వదించును బహుగా
7. నీ జీవితమంతా యెరూషలేముకు
క్షేమము కలుగుటయే జూతువు - క్షేమము
నీ పిల్లల పిల్లలను చూతువు నీవు
ఇశ్రాయేలు మీద నిత్యము సమాధానముండును


Your favourites

  • No Favourites found!