Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో Telugu Christian Song Lyrics

యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో Lyrics

యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో
మహిమగల నీ నామము గొప్పది
1. పగతీర్చుకొను శత్రువును మాన్పివేయ
బాలుర స్తుతి స్తోత్రములతో
స్థాపించితివి నీవొక దుర్గము
నేదాగునట్లు ఆశ్రయ దుర్గము
2. నీ చేతి పనియైన ఆకాశమును
చంద్ర నక్షత్రములనే చూడగా
వాని దర్శించి జ్ఞాపకము చేయ
మానవుండు ఏపాటివాడు
3. నీకంటె మానవుని కొంచెముగా
తక్కువ వానిగా చేసితివి
మహిమ ప్రభావ కిరీటమును
వానికి ధరింపజేసితివి
4. అడవి మృగములు ఆకాశపక్షులు
సముద్ర మత్స్యములు పశువులు
వాని పాదముల క్రిందనుంచి
అధికారము వానికిచ్చితివి
5. నీ నామము మా ప్రభువా యెహోవా
ఎంతో ఘనత ప్రభావము గలది
ఆ నామమును బట్టి మా కిచ్చితివి
నీ రూపమును మాకు హల్లెలూయ


Your favourites

  • No Favourites found!