యెహోవా మా తండ్రి గాఁడ యేసుఁడు మా యన్న గాఁడ మహిమ
గల శుద్ధాత్మ యిట్టి వరుసఁ దెలిపెం గద మాతోడ ||యెహోవా||
1. మోక్ష నగరు మా పుట్టిల్లు ముఖ్య దూతల్ మా స్నేహితులు సాక్షాత్కారమై
యున్నపుడు లక్ష్యపెట్ట మిహ బాధలకు ||యెహోవా||
2. అబ్రాహాము దావీదు మొదలై నట్టి వర భక్తాగ్రేసరులే శుభ్రముగ మా
చుట్టా లైనన్ హర్షమిఁక మా కేమి కొదువ ||యెహోవా||
3. పేతు రాది సకలాపోస్తుల్ పేర్మిగల మా నిజ వర కూటస్థుల్ ఖ్యాతి సభలో
మే మున్నప్పుడు ఘనతలిక మాకేమి వెలితి ||యెహోవా||
4. తనువు బలిపెట్టెను మా యన్న తప్పు ల్విడఁ గొట్టెను మా తండ్రి
మనసులో సాక్ష్యమిట్లున్న మనుజు లెట్లన్నను మా కేమి ||యెహోవా||
5. పరమ విభు జీవగ్రంథములోఁ బ్రభుని రక్తాక్షరముద్రితమె చిరముగా
నుండు మా పేరు చెఱుపు బెట్టెడువా రింకెవరు ||యెహోవా||
6. కరములతో నంట రాని కన్నులకు గోచరము గాని పరమ ఫలముల్
మా కున్నపుడు సరకు గొన మిక్కడి లేములకు ||యెహోవా||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
యెహోవా మా తండ్రి గాఁడ యేసుఁడు Lyrics
Your favourites
- No Favourites found!
