యెహోవా నా బలమా
యదార్థమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది నీ మార్గం ||2|| ||యెహోవా||
నా శత్రువులు నను చుట్టిననూ
నరకపు పాశములరికట్టిననూ ||2||
వరదవలె భక్తిహీనులు పొర్లిన ||2||
విడువక నను ఎడబాయని దేవా ||2|| ||యెహోవా||
మరణపుటురులలో మరువక మొరలిడ
ఉన్నతదుర్గమై రక్షనశృంగమై ||2||
తన ఆలయములో నా మొఱ్ఱ వినెను ||2||
ఆదరెను ధరణి భయకంపముచే ||2|| ||యెహోవా||
నా దీపమును వెలిగించువాడు
నా చీకటిని వెలుగుగా చేయును ||2||
జలరాసులనుండి బలమైన చేతితో ||2||
వెలుపల చేర్చిన బలమైన దేవుడు ||2|| ||యెహోవా||
పౌరుషముగల ప్రభు కొపింపగా
పర్వతముల పునాదులు వణకెను ||2||
తన నోటనుండి వచ్చిన అగ్ని ||2||
దహించివేసెను వైరులనెల్లన్ ||2|| ||యెహోవా||
మేఘములపై ఆయన వచ్చును
మేఘములను తన మాటుగ జేయును ||2||
ఉరుముల మెరుపుల మెండుగ జేసి ||2||
అపజయమిచ్చును అపవాదికిని ||2|| ||యెహోవా||
దయగలవారిపై దయ చూపించును
కఠినులయెడల వికటము జూపును ||2||
గర్విష్టుల యొక్క గర్వమునణుచును ||2||
సర్వమునెరిగిన సర్వాధికారి ||2|| ||యెహోవా||
నా కాళ్ళను లేడి కాళ్లుగా జేయును
ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి ||2||
రక్షణ కేడెము నాకందించి ||2||
అక్షయముగ తన పక్షము జేర్చిన ||2|| ||యెహోవా||
యెహోవా జీవముగల దేవా
బహుగా స్తుతులకు అర్హుడ నీవే ||2||
అన్యజనులలో ధన్యత చూపుచు ||2||
హల్లెలూయ స్తుతిగానము చేసెద ||2|| ||యెహోవా||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
యెహోవా నా బలమా యదార్థమైనది నీ Lyrics
Your favourites
- No Favourites found!
