Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యెహోవా నా బలమా యధార్థమైనది నీ Telugu Christian Song Lyrics

యెహోవా నా బలమా యధార్థమైనది నీ Lyrics

యెహోవా నా బలమా యధార్థమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది నీ మార్గం ||యెహోవా||

1. నా శత్రువులు నను చుట్టినను నరకపు పాశములరికట్టినను
వరదవలె భక్తిహీనులు పొర్లిన వదలక నను
ఎడబాయని దేవా ||యెహోవా||

2. మరణపు టురువులు మరువక మొరలిడ ఉన్నతదుర్గమై
రక్షణ శృంగమై తన ఆలయములో నా మొరవినెను
అదిరెను ధరణి భయకంపముచే ||యెహోవా||

3. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగ
జేయున్ జలరాసులనుండి బలమైన చేతితో వెలుపల
జేర్చిన బలమైన దేవుడు ||యెహోవా||

4. పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతముల పునాదులు
వణకెను తన నోటి నుండి వచ్చిన అగ్ని దహించివేసెను
వైరుల నెల్లను ||యెహోవా||

5. మేఘములపై ఆయన వచ్చును మేఘములను
తన మాటుగ జేయును ఉరుముల మెరుపుల మెండుగ జేసి
అపజయమిచ్చును అపవాదికిని ||యెహోవా||

6. దయగలవారిపై దయచూపించును కఠినుల యెడల
వికటము జూపును గర్విష్ఠుల యొక్క గర్వము నణచును
సర్వము నెరిగిన సర్వాధికారి ||యెహోవా||

7. నా కళ్ళను లేడికాళ్ళగ జేయును యెత్తైన స్థలములో
శక్తితో నిలిపి రక్షణ కేడెము నాకందించి అక్షయముగ
తన పక్షము జేర్చిన ||యెహోవా||

8. యెహోవా జీవము గల దేవా బహుగ స్తుతులకు
అర్హుడ నీవు అన్యజనులలో ధన్యతజూపుచు హల్లెలూయా
స్తుతిగానము జేసెద ||యెహోవా||

Your favourites

  • No Favourites found!