Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యెహోవా నా కాపరి లేమి కలుగదు Telugu Christian Song Lyrics

యెహోవా నా కాపరి లేమి కలుగదు Lyrics

యెహోవా నా కాపరి - లేమి కలుగదు
పచ్చికలపై పరుండజేయుచున్నాడు
1. శాంతికరంబగు శ్రేష్ఠ జలముల - చెంత నన్నడిపించుచున్నాడు
2. సర్వదా నాదు ప్రాణంబునకు - సేద దీర్చుచున్నాడు యెహోవా
3. తన నామమును బట్టి నీతి మార్గములో - నన్ను చక్కగా నడుపుచున్నాడు
4. చీకటి లోయలో నే తిరిగినను - ఎట్టి అపాయమునకు భయపడను
5. నీ దుడ్డుకర్ర నీ దండముతో న-న్నాదరించి తోడై యుందువు
6. నా శత్రువుల యెదుట నీవు నాకు - భోజనము సిద్ధపరచుదువు
7. నూనెతో నా తల నంటియున్నావు - నా గిన్నె నిండి పొర్లుచున్నది
8. నన్ను వెంటాడు సదా కృప క్షేమము - నిత్యమెహోవా మందిరములో నుండెద


Your favourites

  • No Favourites found!