యెహోవ నా కాపరి యిఁకఁ గొదు వేమి ||యెహోవా||
1. పచ్చిక చోట్లలోఁ బండఁ జేయును నన్ను స్వచ్ఛజలముల కడకుఁ
జక్క గా నడిపించు ||యెహోవా||
2. ఆయన దయతో నా యా యాసములఁ దీర్చి న్యాయమార్గములందు
ననుఁ బట్టి నడిపించు ||యెహోవా||
3. గాడాంధకార మా ర్గమున నేఁ దిరిగినను గాఢంపు గృపతోడఁ గరుణించు
నన్నెపుడు ||యెహోవా||
4. నీవు తోడై యుండ నిర్భయం బగు నాకుఁ కావవచ్చును దుడ్డు
కఱ్ఱయును దండంబు ||యెహోవా||
5. నా శత్రువుల నడుమ నాకు భోజన మొసఁగి యాశ తీరంగఁ ద
లంటె నూనెను బోసి ||యెహోవా||
6. నా గిన్నె నిండెను నా బ్రతుకు దినములలో బాగుగా నీదు కృపా
దయలు వెంటాడు ||యెహోవా||
7. పరమానందముతోడఁ బ్రభు సన్నిధానమునఁ పరిశుద్ధాలయమందే
నిరతంబు నివసింతు ||యెహోవా||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
యెహోవ నా కాపరి యిఁకఁ గొదు Lyrics
Your favourites
- No Favourites found!
