యెహోవా నా మొఱ లాలించెను దన మహా దయను నను
గణించెను అహర్నిశల దీనహీనుఁడగు నాదు హాయనెడు ధ్వని
గ్రహించి మనిపెను ||యెహోవా||
1.
పిశాచి గడిమిఁబడఁగొట్టెను దన వశాన నను నిలువఁ బెట్టెను
ప్రశాంత మధుర సు విశేష వాక్ఫల నిశాంతమునఁజేర్చి
సేదఁదీర్చెను ||యెహోవా||
2.
మదావళముఁ బోలు నామదిన్ దన ప్రదీప్త వాక్యాం కూశా
హతిన్ యధేచ్చలన్నిటి గుదించి పాపపు మొదల్ తుదల్ నరికి
దరికిఁ జేర్చెను ||యెహోవా||
3.
అనీతి వస్త్ర మెడలించెను యేసునాధు రక్తమున ముంచెను
వినూత్న యత్నమె ద నూని యెన్నఁడు గనన్ వినన్ బ్రేమ
నాకుఁ జూపెను ||యెహోవా||
4.
విలాపములకుఁ జెవి నిచ్చెను శ్రమ కలాపములకు సెలవిచ్చెను
శిలానగము పైకిలాగి నను సుఖ కళావళుల్ మనసులోన
నిలిపెను ||యెహోవా||
5.
అగణ్య పాపియని త్రోయక నన్ను గూర్చి తన సుతుని దాఁ
చక తెగించి మృతి కొప్పగించి పాపపు నెగుల్ దిగుల్ సొగసుగా
నణంచెను ||యెహోవా||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
యెహోవా నా మొఱ లాలించెను దన Lyrics
Your favourites
- No Favourites found!
