Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
యెహోవా నా స్తుతికాధారుడా మౌనముండకుము మౌనముండకుము Telugu Christian Song Lyrics

యెహోవా నా స్తుతికాధారుడా మౌనముండకుము మౌనముండకుము Lyrics

యెహోవా నా స్తుతికాధారుడా
మౌనముండకుము - మౌనముండకుము
దుష్టులు కపటులు - తమ నోరు తెరచి
అబద్ధములతో - నా పై లేచిరి
1. ద్వేషపు మాటలచే నా చుట్టుచేరి
నిర్నిమిత్తముగా పోరాడుచున్నారు
ప్రేమకు ప్రతిగా పగబూనిరి నా పై
మానక నేను ప్రార్థించుచున్నాను
2. అపవాది వాని కుడి - ప్రక్కనుండునుగాక
వాని ప్రార్థన - పాపమగును గాక
వాని దినములు - కొద్దివగునుగాక
ఆస్తియంతయుదోచు - కొనబడును గాక
3. విధవయై వాని భార్య దిగులొందునుగాక
దేశదిమ్మరులై - పిల్లలుందురు గాక
తల్లిపాపము తుడువ - బడకుండునుగాక
సంతతి యంతయు - నాశమగుగాక
4. పితరుల దోషములు - ఎన్న టెన్నటికిని
జ్ఞాపకముంచు కొనుమో దేవా
రాబోవు తరములలో వాని పేరు
మరువబడి మాసిపోవునుగాక
5. కృపజూపుటయే - మరచినవారై
శ్రమగలవానిని - చంపనాశించిరి
నలిగిన హృదయుల - తరిమెడువానికి
శాపమేగాని - దీవెన యెట్టిది
6. పై వస్త్రమువలె - శాపముండెనుగా
నడికట్టువలె వాని - వదల కుండునుగాక
నా శత్రువులకు - ఓ నా యెహోవా
నీ ప్రతీకారము - ఇదియగుగాక
7. దీవింతువు నన్ను - వారు శపింపగ
నీ దాసుడానందింప సిగ్గగువారికి
జనముల మధ్యను - నిను స్తుతియింతును
కృతజ్ఞతలతో - ఓ నా ప్రభువా


Your favourites

  • No Favourites found!